నాలుగేళ్ల బంధం ముగిసింది.. పెంపుడు శునకం 'బఘీరా' మృతిపై ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్

Tragedy at NTR home Jr NTR emotional post on beloved Bagheera death
  • పెంపుడు శునకం 'బఘీరా' మృతిపై ఎన్టీఆర్ భావోద్వేగం
  • నాలుగేళ్ల బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్
  • నీవు లేని లోటు పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చిందంటూ ఆవేదన
  • ఇటీవలే భుజం గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న తారక్
  • రెండు, మూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యుల వెల్లడి
నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తాను ఎంతగానో ఇష్టపడే పెంపుడు శునకం 'బఘీరా' మరణించడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల తమ బంధాన్ని గుర్తుచేసుకుంటూ, బఘీరా లేని లోటు ఇంట్లో చాలా పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. 

ఈ మేరకు నేడు ఆయన ఇన్స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బఘీరాతో తాను గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. బెర్నీస్ మౌంటెన్ డాగ్ జాతికి చెందిన బఘీరాను ఎన్టీఆర్ ఆప్యాయంగా హత్తుకున్న చిత్రాలు అందులో ఉన్నాయి. బఘీరా జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.

"బఘీరా.. నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు. కానీ, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, ఓదార్పుతో నా రోజులను నింపావు. నీవు లేని లోటు మాటల్లో చెప్పలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ, నువ్వు పంచిన ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. నన్ను నీ తోడుగా ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు, ఈ నాలుగేళ్లను మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం" అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇటీవలే భుజం గాయం నుంచి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో భాగంగా జులై 27న ఆయన భుజానికి గాయమైంది. దీనికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెంజంకి నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 13న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారని, రెండు మూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్ భాస్కర్ రావు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Advertisement
Jr NTR
Bagheera
Jr NTR pet dog
Jr NTR Instagram post
Bernese Mountain Dog
Jr NTR shoulder surgery update

More Telugu News