నారా లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి

Dalavai Ramadevi meets Minister Nara Lokesh to express gratitude
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవి 
  • కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేశ్‌ను కలిసిన వైనం
  • అభినందనలు తెలిపిన నారా లోకేశ్ 
తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే నిజమైన కార్యకర్తలను పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందని, వారికి సముచిత స్థానం కల్పించడంలో ముందుంటుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసేవారికి ఉన్నత అవకాశాలు కల్పించడమే తమ విధానమని ఆయన పేర్కొన్నారు.

నూతనంగా శాసనమండలి సభ్యురాలిగా (ఎమ్మెల్సీ) నియమితులైన దళవాయి రమాదేవి మంగళవారం అమరావతిలో తన కుటుంబసభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, క్షేత్రస్థాయి కార్యకర్తగా తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ఆమె మంత్రి లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె అన్నారు.

ఈ భేటీలో మంత్రి లోకేశ్, రమాదేవిని అభినందించారు. పార్టీ పట్ల ఆమెకున్న విధేయత, చేసిన సేవలకు దక్కిన గుర్తింపు ఈ పదవి అని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటానికి మరింత నిబద్ధతతో పనిచేయాలని ఆమెకు దిశానిర్దేశం చేశారు. శాసనమండలి వేదికగా ప్రజావాణిని బలంగా వినిపించాలని లోకేశ్ సూచించారు.

వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితురాలవడం తెలిసిందే. 
Advertisement
Nara Lokesh
Dalavai Ramadevi
TDP MLC appointment
Andhra Pradesh politics
Vaddera community
Telugu Desam Party

More Telugu News