తుపాకీ కోసం వెళితే.. ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడ్డ రూ.3 కోట్లు.. షాకైన పోలీసులు!
- మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఆటో డ్రైవర్ ఇంట్లో భారీగా నగదు
- తుపాకీ ఉందన్న సమాచారంతో వెళ్లగా రూ.3 కోట్లు లభ్యం
- ఐదు గంటల పాటు నోట్లను లెక్కించిన అధికారులు
- భోపాల్‌లోని ఇంజినీర్ బంధువుదని చెబుతున్న కుటుంబ సభ్యులు
- నగదు మూలాలపై పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ విచారణ
తుపాకీ ఉందన్న సమాచారంతో ఒక ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. అక్కడ తుపాకీ దొరకలేదు కానీ, బ్యాగుల్లో దాచిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. లెక్కపెట్టగా ఏకంగా రూ.3 కోట్ల నగదు ఉండటంతో అధికారులు విస్తుపోయారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ యువకుడు తుపాకీతో ఉన్న ఫొటో పెట్టాడన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు రాజేష్ అహిర్వార్ అనే ఆటో డ్రైవర్ ఇంటిపై దాడి చేశారు. అతని కుమారుడు సౌరభ్ కోసమే పోలీసులు అక్కడకు వెళ్లారు. ఇంట్లో సోదాలు నిర్వహించగా, ఎక్కడా ఆయుధం కనిపించలేదు. అయితే, కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని తెరిచి చూడగా, భారీగా నగదు నిల్వలు బయటపడ్డాయి.
వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, నోట్ల లెక్కింపు యంత్రాన్ని తెప్పించారు. రెవెన్యూ శాఖ అధికారులను కూడా ఘటనా స్థలానికి పిలిపించారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి నోట్లను లెక్కించగా, మొత్తం రూ.3 కోట్ల వరకు ఉన్నట్లు తేలింది. ఇంత భారీ మొత్తంలో నగదు ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత, పోలీసులు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను విచారించారు. ఈ డబ్బు తమ బంధువుదని, అతను భోపాల్‌లో ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని వారు తెలిపారు. అయితే, పోలీసులు వారి వాదనను వెంటనే నమ్మలేదు. సౌరభ్ అహిర్వార్, అంకిత్ అహిర్వార్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎందుకు దాచారు? దానికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ డబ్బు మూలాలను కనుగొనడంపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.