ఝార్ఖండ్ విద్యార్థుల కోసం రాహుల్ లేఖ.. సోరెన్‌కు కీలక సూచన
- సీఎం సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ
- విద్యార్థులతో స్వయంగా మాట్లాడాలని సూచన
- ఝార్ఖండ్‌లో 24 రోజులుగా విద్యార్థుల నిరసన
- కొందరు విద్యార్థుల నిరవధిక నిరాహార దీక్ష
- సోమవారం నాలుగో విడత చర్చలు
ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధులతో సీఎం స్వయంగా సమావేశం కావాలని కోరారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తో కలిసి ఇండియా కూటమిలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి హేమంత్ సోరెన్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో 24 రోజులుగా నిరసన కొనసాగుతోంది. కొందరు విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
విద్యార్థుల శాంతియుత నిరసనకు రాజ్యాంగం హక్కు కల్పించిందని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలపై నిరసనలు చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.
విద్యార్థులతో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించడం అభినందనీయమని రాహుల్ పేర్కొన్నారు. పలు డిమాండ్లపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోందన్నారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి సీఎం స్వయంగా విద్యార్థులతో మాట్లాడితే ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందని సూచించారు.
విద్యార్థుల ఉద్యమంపై ప్రభుత్వం, నిరసనకారుల మధ్య సోమవారం నాలుగో విడత చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమ డిమాండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ఆగస్టు 20న సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ఇప్పటికే ప్రకటించారు.