బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తుల మృతి
- బీహార్‌లోని అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట
- ఘటనలో పలువురికి గాయాలు
- శ్రావణ మూడో సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు
- రెండు రైళ్లు రావడంతో ఒక్కసారిగా పెరిగిన రద్దీ
- బ్యారికేడ్లు కూలడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడి
బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో అశోక్ ధామ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారని తెలిపారు. ఉదయం 6:30 - 6:45 గంటల సమయంలో రెండు రైళ్లు రావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పారు. భారీ జనసందోహం కారణంగా ఒకవైపు బ్యారికేడ్లు విరిగిపోయాయని, దీంతో జనం ఒకరిపై ఒకరు పడిపోయి ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.