హైడ్రాలో 150 ఉద్యోగాలకు వేలల్లో అభ్యర్థులు.. సరూర్‌నగర్ స్టేడియంలో తోపులాట.. ఇదిగో వీడియో!

Telangana
Advertisement
  • సరూర్‌నగర్ స్టేడియానికి వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు
  • నియామక ఈవెంట్స్‌లో తీవ్ర తోపులాట, ఉద్రిక్త వాతావరణం
  • గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన తోపులాట వీడియో
హైదరాబాద్‌లో కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో చెప్పేందుకు సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఘటనే నిదర్శనం. 'హైడ్రా' ప్రకటించిన 150 పోస్టుల కోసం వేలాది మంది యువత తరలిరావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. హైడ్రా విభాగంలో 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీని కోసం ఆగస్టు 8, 9 తేదీల్లో సరూర్‌నగర్ స్టేడియంలో ఉదయం 5 గంటల నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి ఈవెంట్లలో అర్హత సాధించాలని సూచించారు.

అయితే, ప్రకటించిన పోస్టుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా నిరుద్యోగులు ఇవాళ‌ తెల్లవారుజామునకే స్టేడియం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లే క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి, గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ తోపులాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 150 ఉద్యోగాలకే ఈ స్థాయిలో పోటీ ఉందంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

HYDRASaroornagar StadiumHyderabad Job RecruitmentDRF Assistant JobsTelangana UnemploymentHYDRA Jobs Stampede

More Telugu News

అల్లు సినిమాస్‌లో టికెట్లు బ్లాక్..? వెంటనే స్పందించిన అల్లు అరవింద్

22 Nov, 16:28

దోహాలో భారత్ ఎ, పాక్ ఎ జట్ల సమరం.. టాస్ సమయంలో గందరగోళం.. వీడియో ఇదిగో!

22 Nov, 16:20

15 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టి 3బీహెచ్‌కే ఫ్లాట్ కొన్న ఐటీ ఉద్యోగిని కథ!

22 Nov, 16:06

భారత పాస్‌పోర్ట్‌తో ఇప్పుడు ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చో తెలుసా?

22 Nov, 15:54

నైట్ షిఫ్ట్ చేసేవారికి హెచ్చరిక.. గుండె నిర్మాణమే మారిపోతుందని అధ్యయనంలో వెల్లడి

22 Nov, 15:46

మరింత క్వాలిటీ కోసం.. రష్మిక మందన్న 'మైసా' విడుదల వాయిదా

22 Nov, 15:37

పంచాయతీ ఎన్నికల్లో పంతాలకు పోవద్దు: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

22 Nov, 15:22

బంగారం కంటే అయోధ్య భూములే మేలా.. ఎందులో ఎక్కువ లాభాలు?

22 Nov, 15:12

ఒప్పందం కంటే ముందే ప్రాజెక్టు పూర్తి.. అయినా కెనడా బిల్డర్ కు ఎదురుదెబ్బ.. ఎందుకంటే..!

22 Nov, 15:00

తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్!

22 Nov, 14:48

సిద్ధిపేట 'సదర్'లో హరీశ్ రావు జోష్.. ఫొటోలు ఇవిగో!

22 Nov, 14:38

కూతురికి భారం కాకూడదని.. 80 ఏళ్ల వయసులో తన తద్దినం తానే చేసుకున్న వృద్ధుడు

22 Nov, 14:19

పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ.. ఎవరైనా పోటీ చేయవచ్చు: పవన్ కల్యాణ్ ప్రకటన

22 Nov, 14:09

వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు.. అరంగేట్రంలోనే అదరగొట్టిన యువ పేసర్ జంషెడ్ ఆలం!

22 Nov, 14:03

భీమవరం వద్ద జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం

22 Nov, 13:57
..More Telugu News