సంచలనం సృష్టించిన డెన్మార్క్ ప్రిన్సెస్: జీతం తీసుకోకుండానే సైన్యంలో చేరిన ఇసాబెల్లా!
- డెన్మార్క్ సైన్యంలో చేరిన 19 ఏళ్ల ప్రిన్సెస్ ఇసాబెల్లా
- సైనిక సేవలో చేరిన తొలి మహిళా రాజవంశీకురాలిగా గుర్తింపు
- సైనికురాలిగా జీతం, అలవెన్సులు వద్దని స్వచ్ఛంద నిర్ణయం
- కొత్త చట్టం ప్రకారం 11 నెలల పాటు కఠిన శిక్షణ
- సాధారణ సైనికురాలిగా విధులకు హాజరైన యువరాణి
డెన్మార్క్ రాజ కుటుంబంలో ఒక సరికొత్త చారిత్రక అధ్యాయం మొదలైంది. ఆ దేశ రాజు ఫ్రెడెరిక్ ఎక్స్, రాణి మేరీల కుమార్తె, 19 ఏళ్ల ప్రిన్సెస్ ఇసాబెల్లా సైన్యంలో చేరారు. పూర్తిస్థాయి సైనిక సేవల్లోకి అడుగుపెట్టిన తొలి మహిళా రాజవంశీకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.
డెన్మార్క్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11 నెలల తప్పనిసరి సైనిక శిక్షణలో భాగంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హైస్కూల్ విద్య పూర్తికాగానే, స్లాగెల్సేలోని ఆంట్‌వోర్స్కోవ్ బ్యారెక్స్‌లో ఉన్న 'గార్డ్ హుస్సార్ రెజిమెంట్'లో ఆమె రిపోర్ట్ చేశారు. ఎలాంటి ప్రత్యేక హంగులు లేకుండా ఆమె సాధారణ సైనికురాలిగా విధుల్లో చేరడం విశేషం.
ఈ శిక్షణ సమయంలో సాధారణ సైనికులకు ఇచ్చే జీతభత్యాలను తీసుకోకూడదని ప్రిన్సెస్ ఇసాబెల్లా నిర్ణయించుకున్నారు. తన తల్లిదండ్రుల ఆర్థిక అండతోనే ఉంటానని, ప్రభుత్వ వేతనం తనకు వద్దని స్పష్టం చేసినట్లు రాజకుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె సోదరుడు, యువరాజు క్రిస్టియన్ కూడా గతంలో ఇదే రెజిమెంట్‌లో శిక్షణ పూర్తి చేసుకోవడం గమనార్హం.
యూరప్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో డెన్మార్క్ తన రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది. ఇందులో భాగంగానే సైనిక సేవా కాలాన్ని 4 నెలల నుంచి 11 నెలలకు పెంచింది. అంతేకాకుండా, తొలిసారిగా మహిళలకు కూడా తప్పనిసరి సైనిక సేవను వర్తింపజేసింది. ఈ కొత్త సంస్కరణల కింద శిక్షణ పొందుతున్న తొలి బ్యాచ్‌లోనే ప్రిన్సెస్ ఇసాబెల్లా చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.