లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఇకపై ఆ ముగ్గురిదే పూర్తి బాధ్యత!
- లిఫ్ట్ ప్రమాదాలకు తయారీదారు, నిర్వహణ సంస్థ, భవన యజమానిదే బాధ్యత అన్న సుప్రీం
- ఎలివేటర్‌ను 'కామన్ క్యారియర్' (ప్రజా రవాణా సాధనం)గా వర్గీకరించిన అత్యున్నత న్యాయస్థానం
- ఓటిస్ ఎలివేటర్ కంపెనీ అప్పీల్ కొట్టివేత.. రూ.3.01 కోట్ల పరిహారం ఖరారు
- బాధితులు నష్టపరిహారం ఎవరి నుంచైనా పూర్తి స్థాయిలో రాబట్టుకోవచ్చని స్పష్టీకరణ
దేశవ్యాప్తంగా ఎలివేటర్ల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. లిఫ్టుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే, అందుకు తయారీ సంస్థ, నిర్వహణ ఏజెన్సీ, భవన యజమాని ముగ్గురూ ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లిఫ్ట్‌ను ఒక 'కామన్ క్యారియర్' (ప్రజా రవాణా సాధనం)గా వర్గీకరించిన ధర్మాసనం, ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వడం ఈ మూడు వర్గాల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేసింది.
2003లో 'రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్' (ఆర్&ఏడబ్ల్యూ) ప్రధాన కార్యాలయంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో మాజీ దౌత్యవేత్త విపిన్ హండా మరణించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ ఘటనపై ఓటిస్ ఎలివేటర్ కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. బాధితుడి కుటుంబానికి రూ.3.01 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2014లో జాతీయ వినియోగదారుల కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పరిహారంపై 2003 మార్చి నుంచి 9శాతం వార్షిక వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.
ఈ ప్రమాదంలో బాధ్యతను కూడా కోర్టు నిర్ధారించింది. దీని ప్రకారం, ఎలివేటర్ కంపెనీ 70శాతం, నిర్వహణ బాధ్యతలు చూసిన 'మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్' (ఎంఈఎస్) 25శాతం, భవనాన్ని వినియోగిస్తున్న ప్రభుత్వ విభాగం 5శాతం చొప్పున పరిహారం చెల్లించాలని పేర్కొంది.
ప్రమాద బాధితులు నష్టపరిహారం కోసం ఏ ఒక్కరి నుంచైనా పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చని, ఆ తర్వాత సంబంధిత పార్టీలు తమ వాటాలను అంతర్గతంగా పరిష్కరించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఇది బాధితులకు ఉపశమనం కలిగించే కీలక అంశం. ఆధునిక నగరాల్లో లిఫ్టులు నిత్యావసరంగా మారాయని, అందులోకి అడుగుపెట్టిన ప్రయాణికులు తమ భద్రతను పూర్తిగా ఆ వ్యవస్థకే అప్పగిస్తారని, కాబట్టి భద్రతా ప్రమాణాల్లో రాజీకి తావులేదని కోర్టు వ్యాఖ్యానించింది.