కృష్ణా జలాలపై యథాతథస్థితి.. కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- గెజిట్ ప్రచురణపై కర్ణాటక విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ఇది సున్నితమైన అంతర్రాష్ట్ర వివాదమని ధర్మాసనం వ్యాఖ్య
- తదుపరి విచారణ సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా
కృష్ణా నదీ జలాల పంపిణీ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (KWDT-2) తీర్పును అధికారిక గెజిట్‌లో ప్రచురించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న యథాతథ స్థితినే (స్టేటస్ కో) కొనసాగించాలని స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తన వాదనలను వినిపిస్తూ.. ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్-3 కోసం ఇప్పటికే రూ. 29 వేల కోట్లకు పైగా వెచ్చించామని కోర్టుకు తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ లేకపోవడంతో నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయని, రాయచూర్, యాదగిరి వంటి కరువు ప్రాంతాలకు సాగునీటి అవసరం ఎంతో ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2011 నాటి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది.
కర్ణాటక వాదనలను విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, ఇది అనేక న్యాయ, సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంతర్రాష్ట్ర జల వివాదమని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అప్పీళ్లు, అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను హడావుడిగా సవరించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ కేసులో తీర్పు వెలువరించకుండా తాను పదవీ విరమణ చేయబోనని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.