బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న 'అగధ' మూవీ టీమ్.. బోనంతో ప్రమోషన్స్ షురూ
- బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో 'అగధ' చిత్ర ప్రచార జాతర ప్రారంభం
- అమ్మవారికి బోనాలు సమర్పించిన చిత్ర బృందం
- ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
- 'దేవి' వైబ్స్ 'అగధ'లో కనిపిస్తున్నాయన్న నిర్మాత
- త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామన్న దర్శకుడు ఎం.ఎస్. రాజు
ప్రముఖ దర్శకనిర్మాత ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అగధ’. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వినూత్నంగా ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ఆదివారం నాడు ‘అగధ’ ప్రచార జాతరకు శ్రీకారం చుట్టింది.
ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇవాళ చిత్ర యూనిట్ సభ్యులు బల్కంపేట ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కథానాయిక కామాక్షి భాస్కర్ల సంప్రదాయబద్ధంగా అలంకరించుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎం.ఎస్. రాజు, నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, సమర్పకులు అజయ్ కేఆర్, హీరో శ్రవణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ఎన్. సుబ్బరాజు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, "దేవి' చిత్రం సృష్టించిన చరిత్ర లాంటి వైబ్స్ ఇప్పుడు ‘అగధ’ విషయంలోనూ కనిపిస్తున్నాయి. పోస్టర్, టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆగస్ట్ 14న భారీ స్థాయిలో విడుదలవుతున్న మా సినిమా ప్రచార జాతర అమ్మవారి సన్నిధిలో మొదలవడం శుభసూచకం" అని తెలిపారు.
దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, "‘అగధ’ కథలో అమ్మవారి అంశం కీలకంగా ఉంటుంది. అందుకే బల్కంపేట అమ్మవారి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించడం ఆనందంగా ఉంది. పెద్ద బడ్జెట్ సినిమాల తరహాలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తాం. త్వరలోనే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని వివరించారు.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.