నీట్ కుట్రల వెనుక విదేశీ శక్తులు: బండి సంజయ్

24-07-2026 Fri 18:20 | Telangana
Advertisement
  • విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రం అహర్నిశలు కృషి చేస్తోందన్న బండి సంజయ్
  • నీట్ ఘటనపై మోదీ తీవ్రంగా కలత చెందారని వ్యాఖ్య
  • ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారన్న బండి సంజయ్
Advertisement

ఢిల్లీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. నీట్ ఆందోళనల ముసుగులో దేశంలో అరాచకాలు సృష్టించేందుకు కొన్ని కుట్ర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎండగట్టారు.


నీట్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల కలలు, తల్లిదండ్రుల ఆశలతో ముడిపడి ఉన్న అంశమని, ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా కలత చెందారని బండి సంజయ్ తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని, ఇప్పటికే సీబీఐ విచారణ వేగవంతం చేసి 11 మంది ఫ్యాకల్టీ సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేసిందని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనిపై క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. విద్యార్థుల విద్యా సంవత్సరం ఏమాత్రం వృథా కాకూడదనే ఉద్దేశంతో కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరీక్షలు పూర్తి చేసి, ఫలితాలను కూడా వెల్లడించామని వివరించారు.

ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు శక్తులు తీవ్ర అరాచకం సృష్టించాయని ఆయన ఆరోపించారు. ఏకంగా దేశ పార్లమెంట్‌పై దాడి చేసేందుకు కుట్రలు చేస్తూ, దేశ వ్యతిరేక నినాదాలతో విరుచుకుపడ్డారని మండిపడ్డారు. నిరసనల పేరుతో పోలీసులపై, మహిళా జర్నలిస్టులపై అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడులు చేశారని విమర్శించారు. ఈ హింసలో 118 మంది పోలీసుల తలలు పగిలి తీవ్ర గాయాలైనా, అత్యంత సంయమనం పాటిస్తూ ఫైరింగ్ చేయలేదని, శాంతిభద్రతల రక్షణ కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.


ఢిల్లీలో చెలరేగిన ఈ ఉద్రిక్తతల వెనుక విదేశీ కుట్ర కోణం ఉందని బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో విష ప్రచారం చేస్తూ, దేశంలో అశాంతిని రేపేందుకు కుట్రలు పన్నుతున్నారని వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, భారత్‌లో అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను తక్షణమే బ్లాక్ చేసిందని బండి సంజయ్ తెలిపారు.

Advertisement
Bandi Sanjay KumarNEET controversyForeign conspiracyDelhi protestsCBI NEET investigationPakistan social media block

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more