ఐసీసీ అరెస్ట్ వారెంట్‌.. న్యూయార్క్‌లో నెతన్యాహును అరెస్ట్ చేస్తారా?

ICC arrest warrant will Netanyahu be arrested in New York
  • సెప్టెంబరులో ఐరాస సర్వసభ్య సమావేశాలు
  • న్యాయార్క్ వెళ్లనున్న ఇజ్రాయెల్ ప్రధాని 
  • అరెస్ట్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న మేయర్ జోహ్రాన్ మమ్దానీ
  • అలాంటిదేం ఉండదన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • ఐసీసీ పరిధిని, దాని వారెంట్‌ను తోసిపుచ్చిన ఇజ్రాయెల్
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం సెప్టెంబరులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు రానుండటంతో అమెరికాలో తీవ్ర రాజకీయ, చట్టపరమైన వివాదం చెలరేగింది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఆధారంగా నెతన్యాహును న్యూయార్క్‌లో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అనే కోణంలో తమ యంత్రాంగం చట్టపరంగా పరిశీలిస్తోందని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రకటించారు. నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా వ్యాఖ్యానించిన మేయర్, నగర చట్టాల ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు.

అయితే, ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నెతన్యాహును అమెరికా భూభాగంలో ఏ రూపంలోనూ అరెస్ట్ చేసే ప్రసక్తే లేదని సోషల్ మీడియా వేదికగా తేల్చిచెప్పారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఐసీసీ ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో ఈ వారెంట్‌ను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత అమెరికాపై లేదు.

మరోపక్క, ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఐసీసీని తీవ్రంగా విమర్శిస్తూ మేయర్ వ్యాఖ్యలను ఖండించింది. విదేశీ నాయకులకు ఉండే దౌత్యపరమైన మినహాయింపులు, స్థానిక చట్టాల నడుమ నెతన్యాహు పర్యటన ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Advertisement
Benjamin Netanyahu
ICC Arrest Warrant
New York
Donald Trump
United Nations
Israel War Crimes

More Telugu News