'శ్రీనివాస మంగాపురం' నుంచి తొలి సింగిల్... 'రావే చెలియా' వచ్చేసింది!
- జయకృష్ణ ఘట్టమనేని, రాషా థడానీల ‘శ్రీనివాస మంగాపురం’
- ‘రావే చెలియా’ పేరుతో తొలి లిరికల్ సాంగ్ విడుదల
- అజయ్ భూపతి దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం
- జూలై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల
యువ నటీనటులు జయకృష్ణ ఘట్టమనేని, రాషా థడానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి సంగీత ప్రమోషన్లను చిత్రబృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘రావే చెలియా’ అంటూ సాగే తొలి లిరికల్ పాటను సోమవారం విడుదల చేశారు.
జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్, “నా ప్రాణం నను వీడి... నీ వైపే కదిలేనే” అనే సాహిత్యంతో ఆకట్టుకుంటోంది. ఎడబాటుతో బాధపడుతున్న ప్రేమికుల భావోద్వేగాలను ప్రతిబింబించే గీతంగా దీన్ని రూపొందించినట్టు మేకర్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ‘చందమామ కథలు’ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. పి. కిరణ్, మాధవ్ కుమార్ గుళ్లపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
జయకృష్ణ ఘట్టమనేని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న కుమారుడు కాగా... రాషా థడానీ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె.