స్కైరూట్ విజయం వేళ.. రాహుల్ వయసుపై ప్రధాని మోదీ చురకలు
- ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన యువతను ప్రశంసించిన ప్రధాని మోదీ
- రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు
- స్కైరూట్ బృందం సగటు వయసు 28 అని వెల్లడి
- తాను మాట్లాడుతోంది 56 ఏళ్ల యువకుడి గురించి కాదన్న ప్రధాని
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత్‌లో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన హైదరాబాద్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్'ను అభినందిస్తూనే, రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సోమవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని, దేశం సాధించిన ఇటీవలి విజయాలను ప్రస్తావించారు. "భారత్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించిన స్కైరూట్ స్టార్టప్ బృందం సగటు వయసు కేవలం 28 ఏళ్లేనని నాకు తెలిసింది. ఇంతటి అతి పిన్న వయస్కులు ఈ ఘనతను సాధించారు. నేను ఇక్కడ 56 ఏళ్ల 'యువకుడి' గురించి మాట్లాడటం లేదు... రోదసిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన 28 ఏళ్ల యువత గురించి మాట్లాడుతున్నాను" అని మోదీ పేర్కొన్నారు. జూన్ మాసంలో 56వ ఏట అడుగుపెట్టిన రాహుల్ గాంధీని ఉద్దేశించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ శనివారం 'విక్రమ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా అమెరికా, చైనాల తర్వాత ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాలను కలిగిన మూడో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ ఘనతను భారత యువత సాధించడం దేశానికే గర్వకారణమని మోదీ కొనియాడారు.
గత ఏడాది వర్షాకాల సమావేశాల కంటే ముందు ఓ భారత పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న అంశాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్లమెంట్ సమావేశాలు అర్థవంతంగా, ఫలప్రదంగా సాగాలని, ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.