త్రిపుర డీజీపీ ఆత్మహత్య.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర కలకలం
- పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలోనే ఘటన
- తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణ
- ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనురాగ్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లోనే ఆయన తుపాకితో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
డీజీపీ అనురాగ్ తన కార్యాలయంలోని బాత్రూంలో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. హుటాహుటీన ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ఈ అఘాయిత్యానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై త్రిపుర ప్రభుత్వం కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెంటనే పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.