సీజేపీ కార్యకర్తలపైకి టియర్‌ గ్యాస్‌.. ఢిల్లీలో ఉద్రిక్తత.. పార్లమెంట్‌ గేట్లు బంద్‌!

20-07-2026 Mon 14:16 | National
Advertisement
  • నీట్‌ అంశంపై సీజేపీ 'చలో సంసద్‌' పిలుపు
  • పార్లమెంట్‌ వైపు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • టియర్‌ గ్యాస్‌, లాఠీచార్జ్‌తో ఉద్రిక్తత
  • ఢిల్లీలో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత
  • అభిజీత్‌ దీప్కే నిరాహార దీక్ష విరమణ
Advertisement
కాక్రోచ్‌ జనతా పార్టీ తలపెట్టిన చలో సంసద్‌ నిరసన ర్యాలీ మరింత ఉద్రిక్తంగా మారింది. ఉదయమే నిరసనకారులను జంతర్‌ మంతర్‌ వద్ద నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వాళ్లు ముందుకు సాగారు. పలు అంచెల్లో ఏర్పాటు చేసిన భద్రతను దాటుకొని మరీ దాదాపు పార్లమెంటు సమీపంలోకి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీఛార్జ్‌ కూడా చేశారు.

ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని తోపులాట జరిగింది. దీంతో పలువురు నిరసనకారులతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. ఇదంతా పార్లమెంటుకు 200 మీటర్ల దూరంలోనే జరిగింది. ఈ క్రమంలో పార్లమెంట్‌ ప్రధాన ద్వారాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొన్ని గేట్లను మూసివేశారు.

ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్‌ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు తమ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని సీజేపీ పిలుపునిచ్చింది. శాంతియుత పోరాటంతోనే లక్ష్యాన్ని సాధిస్తామని సోషల్‌ మీడియాలో పేర్కొంది.

ఈ ఆందోళనకు ముందు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆత్మహత్య చేసుకున్న ఓ నీట్‌ విద్యార్థిని తండ్రి విజ్ఞప్తి మేరకు దీక్ష విరమించినట్లు సీజేపీ తెలిపింది. పార్లమెంట్‌ ర్యాలీకి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని ఆయనను ఒప్పించడంతో దీక్ష ముగిసిందని పార్టీ వెల్లడించింది.

జంతర్‌మంతర్‌ వద్ద మరో వివాదం కూడా చెలరేగింది. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకపోయినా ఒక అంబులెన్స్‌ను నిరసన ప్రాంగణంలోకి పంపారని సీజేపీ ఆరోపించింది. దాంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనను భంగం కలిగించేందుకే ఇలా చేశారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
Advertisement
Cockroach Janata PartyNEET exam protest DelhiAbhijit DipkeMonsoon Parliament SessionJantar Mantar protestDelhi Police tear gas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more