సీఎం విజయ్‌కు బెదిరింపులు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్!
- సీఎం విజయ్‌పై మార్కంటేయన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ప్రసంగం వైరల్
- సోమవారం తెల్లవారుజామున పోలీసుల చర్య
- అరెస్టును నిరసిస్తూ పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మద్దతుదారుల యత్నం
- తమిళనాడులో అధికార, ప్రతిపక్షాల మధ్య ముదిరిన రాజకీయ కాక
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌పై బహిరంగంగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే జి.వి.మార్కండేయన్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిల్‌పట్టిలో జరిగిన పార్టీ బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడిన మాటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఎముకలు విరగ్గొడతాం
కొవిల్‌పట్టిలోని కృష్ణన్ కోవిల్ మైదానంలో ఆదివారం రాత్రి డీఎంకే పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ఎమ్మెల్యే ఐ.కరుణానిధితో పాటు పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేదికపై మార్కండేయన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ పనితీరు, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి విజయ్‌ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ.. "అసెంబ్లీ కనుక సమావేశమైతే నీ ఎముకలు మిగలవు, మా డీఎంకే శాసనసభ్యులు నీ ఎముకలు విరగ్గొట్టి నిన్ను వెనక్కి పంపుతారు" అంటూ నేరుగా ముఖ్యమంత్రికే హెచ్చరికలు జారీ చేశారు.
అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడి
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ఒక శాసనసభ్యుడు ఇలాంటి హింసాత్మక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల నుండే కాకుండా ప్రజల నుండి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. సోమవారం తెల్లవారుజామునే విలాతికుళంలోని మార్కండేయన్ నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే అరెస్ట్ వార్త తెలియడంతో ఆయన మద్దతుదారులు, డీఎంకే కార్యకర్తలు భారీగా నివాసం వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కండేయన్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి, మార్కండేయన్‌ను తదుపరి విచారణ నిమిత్తం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ తాజా అరెస్టుతో తమిళనాడులో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే), ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరింది.