ఇరాన్ సైనిక స్థావరాలే టార్గెట్.. ‘హర్మూజ్’లో సెంటకామ్ విధ్వంసం!
- ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు రాత్రి కూడా అమెరికా వైమానిక దాడులు
- వాణిజ్య నౌకలపై దాడులను అరికట్టడమే సెంట్‌కామ్ లక్ష్యం
- తీరప్రాంత నిఘా నేత్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా దాడులు
- జోర్డాన్‌లోని అమెరికా సైనికులపై ఇరాన్ దాడికి ప్రతీకారం
- పశ్చిమాసియాలో 50,000 మందికి పైగా అమెరికా సైనికులు సర్వసన్నద్ధం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా అమెరికా సైన్యం తన దాడులను ఉద్ధృతం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. యూఎస్ దళాలు వరుసగా తొమ్మిదో రోజు రాత్రి కూడా ఇరాన్‌పై వ్యూహాత్మక వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ సరికొత్త దాడుల పర్వం ప్రారంభమైంది.
అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ దాడులను తిప్పికొట్టేందుకే తాము వరుస దాడులు చేస్తున్నట్లు సెంటకామ్ ఎక్స్ ద్వారా స్పష్టం చేసింది. "ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేసేందుకు మా దాడులు కొనసాగుతాయి" అని యూఎస్ కమాండ్ పేర్కొంది. అంతకుముందు జులై 18న కమాండర్ ఇన్ చీఫ్ ప్రత్యక్ష ఆదేశాల మేరకు ఇరాన్ దక్షిణ ప్రావిన్స్‌లలోని రక్షణ మౌలిక సదుపాయాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది.
గత 9 రోజులుగా జరుగుతున్న ఈ భీకర దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలను అమెరికా దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. జులై 17న జోర్డాన్‌లోని అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఇరాన్ రక్షణ దళానికి చెందిన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్' (ఐఆర్‌జీసీ) గ్రూపులపై కూడా అమెరికా గట్టి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో 50,000 మందికి పైగా అమెరికా సైనికులు మోహరించి ఉన్నారని, ఏ క్షణంలోనైనా శత్రువులను తుత్తునియలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని సెంటకామ్ హెచ్చరించింది.