ప్రశ్న రావణ్ కేసులో పోలీసు విచారణకు హాజరైన యూట్యూబ్ చానల్ సీఈవో గమన
- 'ప్రశ్న రావణ్' కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
- యూట్యూబ్ ఛానల్ సీఈవో గమన, వైసీపీ నేత ఇంద్రసేనపై 5 గంటల విచారణ
- ఆర్థిక లావాదేవీలు, ఛానల్ ఫండింగ్‌పై ప్రధానంగా పోలీసుల దృష్టి
- ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు
- మాదాపూర్ కార్యాలయంలోని ఆధారాలతో కేసు దర్యాప్తు ముమ్మరం
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, హిందూ దేవుళ్లను కించపర్చడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్' కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబ్ ఛానల్ సీఈవో గమన, భవన యజమాని, వైసీపీ నాయకుడు ఇంద్రసేనా చౌదరిలను పోలీసులు రెండో రోజు సుదీర్ఘంగా విచారించారు.
సోమవారం గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో... డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం వీరిద్దరినీ సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. విచారణ అనంతరం వారిని పంపించివేసిన పోలీసులు, ఈ నెల 17వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
రెండో రోజు విచారణలో పోలీసులు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు, ఛానల్ నిర్వహణ వెనుక ఉన్న సూత్రధారులపైనే దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివాదాస్పద యూట్యూబర్ రావణ్‌కు, వైసీపీ నేత ఇంద్రసేనా చౌదరికి మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి? వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలపై పోలీసులు కూలంకషంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో, ఛానల్ సీఈవోగా గమన పాత్రపైనా అధికారులు ఆరా తీశారు. ఆమె ఎప్పటి నుంచి ఈ బాధ్యతల్లో ఉన్నారు, ఛానల్‌కు వస్తున్న నిధుల మూలాలు ఎక్కడ ఉన్నాయి, తెరవెనుక ఉండి నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరు అనే కోణంలోనూ ప్రశ్నలు సంధించారు.
గతంలో రావణ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత, హైదరాబాద్ మాదాపూర్‌లోని 'ఎలైట్' భవనంలో ఉన్న అతని యూట్యూబ్ ఛానల్ కార్యాలయంలో గన్నవరం పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. రావణ్ భార్య సమక్షంలో జరిగిన ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆధారాల విశ్లేషణలో లభించిన ప్రాథమిక సమాచారం మేరకే ప్రస్తుతం గమన, ఇంద్రసేనలను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దొరికిన డిజిటల్ డేటా ఆధారంగా ఈ కేసులో మరిన్ని చిక్కుముడులు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.