9 మంది పిల్లల తల్లి.. ప్రియుడితో ఉండగా చూశాడని భర్త దారుణ హత్య
- సహజ మరణంగా చిత్రీకరించిన భార్య, ప్రియుడు
- పోస్ట్‌మార్టమ్‌లో గొంతు నులిమి చంపినట్లు వెల్లడి
- భార్య, ఆమె ప్రియుడు సహా ముగ్గురి అరెస్ట్
- తండ్రి మృతి, తల్లి జైలుపాలు.. అనాథగా మారిన 9 మంది పిల్లలు
గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి ఓ భార్య దారుణంగా హత్య చేసింది. మొదట సహజ మరణంగా అందరినీ నమ్మించినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.
పోలీసుల కథనం ప్రకారం.. వావ్-థరాడ్ జిల్లా గణేష్‌పుర గ్రామానికి చెందిన గమాభాయ్ ఠాకూర్ అనే వ్యవసాయ కూలీ జులై 8న రాత్రి తన ఇంట్లో శవమై కనిపించాడు. మొదట సాధారణ మరణంగా భావించినా, పోలీసులకు అనుమానం రావడంతో కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఘటన జరిగిన రోజు రాత్రి గమాభాయ్ ఇంటికి వచ్చేసరికి, తన భార్య నర్మద ఆమె ప్రియుడు ప్రేమ్‌జీ పటేల్‌తో ఉండటాన్ని చూశాడు. ఈ విషయమై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో నర్మద చెక్క పలకతో గమాభాయ్ తలపై కొట్టడంతో అతను కిందపడిపోయాడు. ఆ తర్వాత నర్మద, ఆమె ప్రియుడు ప్రేమ్‌జీ, మరో సహచరుడు ముఖేశ్ ఠాకూర్‌తో కలిసి తాడుతో గమాభాయ్ గొంతు నులిమి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం, గమాభాయ్ గుండెపోటుతో సహజంగా మరణించాడని నిందితులు అందరినీ నమ్మించారు.
అయితే, ఊపిరాడకపోవడం వల్లే మరణం సంభవించిందని పోస్ట్‌మార్టమ్ నివేదిక స్పష్టం చేయడంతో ఇది హత్య అని నిర్ధారణ అయింది. పోలీసులు భార్య నర్మదతో పాటు ఆమె ప్రియుడు ప్రేమ్‌జీ పటేల్, ముఖేష్ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ దంపతులకు తొమ్మిది మంది పిల్లలు ఉండటం గమనార్హం. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఆ చిన్నారులంతా అనాథలుగా మారారు.