హర్మూజ్ తెరిచే ఉంది: అమెరికా ప్రకటన
- హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన
- ఇరాన్ వాదనలను ఖండించిన అమెరికా
- జలసంధి తెరిచే ఉందని వెల్లడి
- వాణిజ్య నౌకపై దాడితో పెరిగిన ఉదిక్తత.. ఇరాన్
- అమెరికా వైమానిక దాడులు
- అమెరికా దాడులకు ప్రతిగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ప్రతిదాడులు
కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించినప్పటికీ, వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఆ మార్గం తెరిచే ఉందని అమెరికా స్పష్టం చేసింది. ఇటీవల ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్థావరాలపై అమెరికా ఆదివారం మరోసారి వైమానిక దాడులు నిర్వహించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
హోర్ముజ్ జలసంధి గుండా నౌకల స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారించడానికి తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్రకామ్) వెల్లడించింది. జలసంధిని మూసివేశామన్న ఇరాన్ వాదనలను అమెరికా కొట్టిపారేసింది. గత వారంలోనే 140కి పైగా నౌకలు ఈ మార్గం ద్వారా సురక్షితంగా ప్రయాణించాయని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.