మంత్రిగారికే షాక్.. చిల్లర లేదని బస్సు దింపేసిన కండక్టర్!
- మారువేషంలో బీఎంటీసీ బస్సు ఎక్కిన కర్ణాటక రవాణా మంత్రి
- టికెట్ కోసం చిల్లర ఇవ్వలేదని బస్సు దిగిపొమ్మన్న కండక్టర్
- మాస్క్ ధరించడంతో మంత్రిని గుర్తుపట్టని బస్సు సిబ్బంది
- ఆటోలోనూ మంత్రికి ఇబ్బందులు.. మీటర్ కన్నా అధిక ఛార్జీ వసూలు
సాధారణ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మారువేషంలో బయలుదేరిన కర్ణాటక రవాణా శాఖ మంత్రి భైరతి సురేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. టికెట్ కోసం చిల్లర లేకపోవడంతో ఓ బీఎంటీసీ బస్సు కండక్టర్ ఆయన్ను బస్సు దిగిపొమ్మన్నారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..!
మంత్రి భైరతి సురేశ్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన మాస్క్ ధరించి, సాధారణ ప్రయాణికుడిలా హెబ్బాల్ నుంచి నాగశెట్టిహళ్లి వెళ్లేందుకు బీఎంటీసీ బస్సు ఎక్కారు. రెండు టికెట్లు కొని, కండక్టర్‌కు రూ. 100 నోటు ఇచ్చారు. అయితే, కండక్టర్ చిల్లర ఇవ్వాలని అడగ్గా, తన వద్ద లేదని మంత్రి బదులిచ్చారు. దీంతో తన వద్ద కూడా చిల్లర లేదని, సరిగ్గా డబ్బులు చెల్లించలేకపోతే బస్సు దిగిపోవాలని కండక్టర్ స్పష్టం చేశారు. మంత్రి మాస్క్ ధరించి ఉండటంతో కండక్టర్ ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. దీనిపై మంత్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా బస్సు దిగిపోయారు.
అనంతరం నాగశెట్టిహళ్లి నుంచి కొద్ది దూరం ప్రయాణించేందుకు మంత్రి ఓ ఆటో ఎక్కారు. మీటర్‌లో ఛార్జీ రూ. 30 చూపించగా, డ్రైవర్ రూ. 36 డిమాండ్ చేశాడు. ఎందుకని ప్రశ్నించగా.. మీటర్‌ను త్వరలో సరిచేయిస్తానని సమాధానమిచ్చాడు. చివరికి మంత్రి అతనికి రూ. 40 ఇచ్చి ఆటో దిగారు. ఈ తనిఖీ ద్వారా ప్రజా రవాణాలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను మంత్రి స్వయంగా తెలుసుకున్నారు.