విశాఖలో స్వల్ప భూకంపం.. ఉలిక్కిపడిన నగరవాసులు
- విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు
- భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
- భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 నుంచి 4.5గా నమోదు
విశాఖపట్నం నగరంలో సంభవించిన భూప్రకంపనలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడంతో పలు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెద వాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.0 నుంచి 4.5గా నమోదైంది. బంగాళాఖాతంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.