వైభవ్ సూర్యవంశీపై వేటు.. గంభీర్ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం!
- ఇంగ్లాండ్‌తో చివరి టీ20లో వైభవ్ స్థానంలో తిరిగి జట్టులోకి సంజూ శాంసన్
- టీమిండియా మేనేజ్‌మెంట్‌పై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం
- ఇది చాలా కఠినమైన నిర్ణయమంటూ గంభీర్‌ను తప్పుబట్టిన గవాస్కర్
- వైభవ్‌కు అండగా నిలిచిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్
ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎంపిక వివాదానికి దారితీసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి, ఫామ్‌లో లేని సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
సిరీస్ ఫలితం ఇప్పటికే తేలిపోయిన నేపథ్యంలో, ఈ నామమాత్రపు మ్యాచ్‌లో యువ ఆటగాడిని పక్కనపెట్టడంపై సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "వైభవ్‌ను తీసుకోకపోవడం నన్ను చాలా నిరాశపరిచింది. ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ అయితే, అనుభవం ఉన్న ఆటగాడిని ఆడించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో ఒక యువ ప్రతిభావంతుడికి అవకాశం ఇవ్వకపోవడం పెద్ద తప్పు. ఎవరో ఒకరు ఆ పిల్లాడి భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పాలి. కేవలం మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా 15 ఏళ్ల బాలుడిని జట్టు నుంచి తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
మరోవైపు, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా భారత యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. "వైభవ్‌ను భవిష్యత్ సూపర్ స్టార్ అని నమ్మినప్పుడు, అతడికి కేవలం మూడు మ్యాచ్‌లు ఇచ్చి ఎలా వదిలేస్తారు? ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతడు తన సత్తా చూపించాడు. ఫామ్ లేక 5, 0, 1 పరుగులు చేసిన శాంసన్‌ను మళ్ళీ తెచ్చారు. అతడి కంటే 13, 14, 15 పరుగులు చేసిన ఈ పిల్లాడే బెటర్‌గా ఆడాడు" అని స్వాన్ అన్నాడు.
ఈ సిరీస్‌లో వైభవ్ మూడు మ్యాచ్‌ల్లో 42 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పేసర్ల బౌన్స్‌ను ఎదుర్కోవడంలో కాస్త తడబడినప్పటికీ, వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 15 ఏళ్ల వయసులో ఉన్న ఒక ఆటగాడిని ఇలా హఠాత్తుగా తొలగించడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, జట్టు పేలవ ప్రదర్శనకు ఆ కుర్రాడిని బలిపశువును చేయకూడదని స్వాన్ హితవు పలికాడు.