అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ
- అఖిల్ 'లెనిన్' నుంచి శ్రీలీలను తప్పించడంపై వీడిన సస్పెన్స్
- డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే మార్చామన్న నిర్మాత నాగవంశీ
- శ్రీలీల స్థానంలో వచ్చిన భాగ్యశ్రీ నటనకు ప్రశంసల వెల్లువ
- భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకంగా మారిన ‘లెనిన్’ చిత్రం
- రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రేపు (జులై 10న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు హీరోయిన్‌గా శ్రీలీలను ప్రకటించి, ఆ తర్వాత ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవడంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ, హీరోయిన్ మార్పు వెనుక అసలు కారణాన్ని నిర్మాత నాగవంశీ తాజాగా వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. శ్రీలీలను తప్పించడం వెనుక ఎలాంటి వివాదాలు లేవని, కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ మార్పు జరిగిందని స్పష్టం చేశారు. "కథకు సంబంధించిన క్రియేటివ్ చర్చల వల్ల మా వైపు నుంచే కొంత ఆలస్యం జరిగింది. మేము షూటింగ్ ప్లాన్ చేసుకునే సమయానికి శ్రీలీల ఇచ్చిన డేట్స్ అందుబాటులో లేవు. ఆ తర్వాత ఆమెకు కార్తీక్ ఆర్యన్ సినిమా, 'పరాశక్తి' వంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. మళ్లీ మేము షూటింగ్‌కు సిద్ధమయ్యేసరికి, ఆమె ఆ సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ క్లాష్ అయ్యాయి. ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఇరు పక్షాల అంగీకారంతోనే హీరోయిన్‌ను మార్చాల్సి వచ్చింది. ఇందులో శ్రీలీల పొరపాటు ఏమీ లేదు" అని నాగవంశీ వివరించారు.
హీరోయిన్ మార్పుతో కొంత భాగం రీషూట్ చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అయితే, సినిమా ఫైనల్ కాపీ చూశాక, ఈ పాత్ర కోసమే భాగ్యశ్రీ పుట్టిందా అన్నంత అద్భుతంగా నటించిందని నాగవంశీ ప్రశంసించారు. ఇదే విషయంపై అక్కినేని నాగార్జున సైతం స్పందిస్తూ.. "భాగ్యశ్రీ నటన అమోఘం. ఆమె కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అనిపించింది" అని కొనియాడారు.
‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, గ్లామర్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఆమెకు ఇప్పటివరకు సరైన కమర్షియల్ హిట్ పడలేదు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ విజయం అఖిల్‌తో పాటు భాగ్యశ్రీ కెరీర్‌కు కూడా ఎంతో కీలకంగా మారింది. ప్రస్తుతం సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నడుస్తుండటంతో, ఈ చిత్రంతో ఇద్దరూ భారీ విజయాన్ని అందుకుంటారని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.