స్క్రీన్ లేదు.. ఫీచర్లు మాత్రం ఫుల్.. నాయిస్ కొత్త బ్యాండ్
- నాయిస్ నుంచి ఆర్‌ఈపీ బ్యాండ్
- స్క్రీన్ లేని వేర్‌బుల్‌గా డిజైన్
- ప్రారంభ ధర రూ.9,999
- 10 రోజుల బ్యాటరీ
- 24 గంటల హెల్త్ ట్రాకింగ్
- ప్రీ బుకింగ్‌లు ప్రారంభం
స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా స్క్రీన్ లేకుండా పనిచేసే కొత్త వేర్‌బుల్‌ను నాయిస్ భారత మార్కెట్‌లో తీసుకొచ్చింది. ‘నాయిస్ ఆర్‌ఈపీ బ్యాండ్’ పేరుతో విడుదలైన ఈ డివైజ్ నిరంతర ఆరోగ్య పర్యవేక్షణపై దృష్టి పెట్టింది. ఆరోగ్య సమాచారం చూడటానికి ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకపోవటం దీని ప్రత్యేకత.
భారత్‌లో ఈ బ్యాండ్‌ను ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి రూ.9,999 ప్రత్యేక ధరగా నిర్ణయించింది. వివిడ్ ఆరెంజ్, నేవీ బ్లూ, క్లాసిక్ బ్లాక్, సాండ్ బేజ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సాధారణ విక్రయ ధర, అమ్మకాల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ఈ బ్యాండ్‌లో అధునాతన ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సార్‌ను అమర్చారు. ఇందులో నాలుగు ఫొటోడియోడ్లు, నాలుగు గ్రీన్ ఎల్‌ఈడీలు, గ్రీన్, రెడ్, ఇన్‌ఫ్రారెడ్ మల్టీ వేవ్‌లెంగ్త్ ఎల్‌ఈడీలు ఉన్నాయి. వివిధ చర్మ రంగులపై కూడా కచ్చితమైన ఫలితాలు ఇచ్చేలా సెన్సార్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. అంతర్గత పరీక్షల్లో హార్ట్‌రేట్ రీడింగ్‌లు అత్యంత కచ్చితంగా వచ్చినట్లు వెల్లడించింది.
హార్ట్‌రేట్‌తో పాటు హార్ట్‌రేట్ వేరియబిలిటీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, శ్వాస వేగం, ఒత్తిడి, నిద్ర, రికవరీ స్కోర్, స్టామినా, VO2 వంటి ఆరోగ్య వివరాలను 24 గంటలూ ట్రాక్ చేస్తుంది. నడక, పరుగు, సైక్లింగ్, ఎలిప్టికల్ ట్రైనింగ్, రోయింగ్ వంటి వ్యాయామాలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో పనిచేసే నాయిస్‌ఫిట్ యాప్‌తో కనెక్ట్ చేసి ఏఐ ఆధారిత ఆరోగ్య సూచనలను కూడా అందిస్తుంది.
స్క్రీన్ లేకపోవటం ఈ బ్యాండ్‌లో ప్రధాన ప్రత్యేకత. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, చర్మానికి ఇబ్బంది కలిగించని స్ట్రాప్‌తో రూపొందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని బరువు 27 గ్రాములు మాత్రమే.