పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు

India concerned over West Asia tensions calls for restraint
  • చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని హితవు
  • పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
  • అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పు కలిగించొద్దని విన్నపం
  • దౌత్యా మార్గాన్నే ఆశ్రయించాలని పిలుపు
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని పక్షాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలను తగ్గించాలని సూచించింది. పౌరుల భద్రతతో పాటు ఇంధన సరఫరా, వాణిజ్య కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరింది. శాశ్వత పరిష్కారం కోసం మళ్లీ చర్చలు, దౌత్య మార్గాన్నే ఆశ్రయించాలని పిలుపునిచ్చింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ దాదాపు ముగిసిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ హెచ్చరించారు. హర్మూజ్‌ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై దాడులకు ప్రతిస్పందనగానే అమెరికా తాజా దాడులు చేపట్టిందని తెలిపారు. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆరు శాతానికి పైగా పెరిగాయి. ఇరాన్‌ సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ శాఖ కూడా వెల్లడించింది.
Advertisement
India
West Asia tensions
Donald Trump
US Iran conflict
Hormuz Strait attacks
Crude oil prices

More Telugu News