ఐఐటీలను మించిన ప్యాకేజీ.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం

IIIT Bangalore student gets 15 crore package surpassing IIT placements
  • మరో ఇద్దరికి రూ.1.3 కోట్ల ప్యాకేజీలు
  • 22 మందికి రూ.60 లక్షలకు పైగా వేతనం
  • 110 మందికిపైగా రూ.20 లక్షలకు మించిన ప్యాకేజీలు
  • 316 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
బెంగళూరు ఐఐఐటీ (ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్మఫర్మేషన్ టెక్నాలజీ) విద్యార్థికి ఏకంగా రూ.1.5 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో నమోదైన అత్యధిక ప్యాకేజీల్లో ఇదొకటి. పలు ఐఐటీల్లో ప్రకటించిన గరిష్ఠ ప్యాకేజీల కంటే కూడా ఇది ఎక్కువ కావడం విశేషం.

ఈ భారీ ఆఫర్‌ను ఐఐఐటీ బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చదివిన ఓ విద్యార్థి దక్కించుకున్నాడు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించారు. ప్లేస్‌మెంట్లలో మరో 22 మందికి రూ.60 లక్షలకు పైగా వార్షిక వేతనం లభించింది. 27 మంది రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ప్యాకేజీలు అందుకున్నారు. మొత్తం 110 మందికిపైగా విద్యార్థులు రూ.20 లక్షలకు మించిన వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు.

ఈ వివరాలను ఐఐఐటీ బెంగళూరు 26వ స్నాతకోత్సవంలో వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 316 మంది పట్టాలు అందుకున్నారు. వీరిలో 95 మంది ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, 175 మంది ఎంటెక్‌, 32 మంది ఎంఎస్‌ (రిసెర్చ్‌) పూర్తి చేశారు. మరో 14 మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు.

స్నాతకోత్సవంలో పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తి చేసిన కవల సోదరులు సిద్ధార్థ్‌ కొఠారి, సంకల్ప్‌ కొఠారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే నిమ్‌హాన్స్‌కు చెందిన న్యూరో సర్జన్‌ వికాస్‌ వజాయిల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో సంస్థ నుంచి 100వ పీహెచ్‌డీ పట్టా అందుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.
Advertisement
IIIT Bangalore
IIIT Bangalore Placements 2024
Highest Salary Package 1.5 Crore
IIT vs IIIT Placements
Siddharth Kothari Sankalp Kothari
Bangalore Education News

More Telugu News