పుట్టడమే కోటీశ్వరులుగా మారే ఛాన్స్: అమెరికా పిల్లల కోసం ట్రంప్ బంపర్ ఆఫర్!
- పిల్లల పేరిట ట్రంప్ అకౌంట్స్ ప్రారంభం
- స్టాక్ మార్కెట్‌తో ఇన్వెస్ట్మెంట్ అనుసంధానం
- ఒక్కో ఖాతాలో వెయ్యి డాలర్ల డిపాజిట్
- డెల్ సంస్థ భారీ ఆర్థిక విరాళం
- అమెరికా ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం
అమెరికా పిల్లలకు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం 'ట్రంప్ అకౌంట్స్' అనే సరికొత్త పెట్టుబడి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన అధ్యక్ష కాలంలోనే ఇది అత్యంత కీలకమైన, ప్రతిష్ఠాత్మకమైన పథకమని ఆయన అభివర్ణించారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్, నాస్డాక్ సంయుక్తంగా నిర్వహించిన గంట మోగించే కార్యక్రమంలో వైట్‌హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడారు. ఈ ఖాతాల ద్వారా పిల్లలు చిన్న వయసు నుంచే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా సంపదను కూడబెట్టుకోవచ్చని ఆయన తెలిపారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు 5 లక్షలకు పైగా ఖాతాల్లో ప్రభుత్వం తరఫున వెయ్యి డాలర్ల (1,000 డాలర్లు) చొప్పున వన్-టైమ్ సీడ్ మనీని డిపాజిట్ చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అధికారిక వెబ్సైట్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ దాతలు, కంపెనీల భాగస్వామ్యంతో మిలియన్ల మంది పిల్లలకు ఈ ప్రయోజనం అందుతుందన్నారు. "ప్రజలు పుట్టినప్పుడు చేతిలో రూపాయి లేకుండా పుడతారు, కానీ ఈ పథకం ద్వారా చాలా చిన్న వయసులోనే ధనవంతులుగా మారతారు. గత 25 ఏళ్లుగా మేము దీనిని చేయాలనుకుంటున్నాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఆమోదం పొందిన "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" చట్టం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందని, దీని మద్దతుదారులే ఈ ఖాతాలకు తన పేరు పెట్టారని, తన పేరు ఉంటేనే మార్కెట్లోకి బాగా దూసుకెళ్తుందని వారు భావించారని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో మైఖేల్, సుసాన్ డెల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 2016 నుంచి 2024 మధ్య జన్మించిన అర్హులైన అమెరికన్ పిల్లల కోసం డెల్ దంపతులు 6.25 బిలియన్ డాలర్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. దేశంలోని అత్యుత్తమ కంపెనీలలో పెట్టుబడులతో ప్రతి బిడ్డ జీవితం ప్రారంభం కావాలన్నదే తమ ఆకాంక్ష అని మైఖేల్ డెల్ పేర్కొన్నారు.
ఇన్వెస్టర్ బ్రాడ్ గెర్స్ట్నర్ మాట్లాడుతూ.. రాబోయే ఏడాదిలో పిల్లల ఖాతాల కోసం 100 బిలియన్ డాలర్లకు పైగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భవిష్యత్తులో అమెరికాలోని ప్రతి బిడ్డకూ దీనిని విస్తరిస్తామని చెప్పారు. ఈ పథకం పిల్లల్లో ఆర్థిక పరిజ్ఞానాన్ని, వ్యాపార నైపుణ్యాలను పెంచుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమం మధ్యలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ వంటి పలు ఇతర అంశాలపై కూడా ట్రంప్ మాట్లాడారు.