'ఆమెది సైకో మైండ్': సియాగోయల్‌పై సుచిత్ర షాకింగ్ కామెంట్స్!
- కేతన్ అగర్వాల్ హత్యకేసులో కాబోయే భార్య సియా గోయల్ అరెస్ట్
- నిందితురాలిని సమర్థించిన నెటిజన్‌పై సుచిత్రా కృష్ణమూర్తి ఆగ్రహం
- నేరపూరిత ప్రవర్తనను సమర్థించడం ఆమోదయోగ్యం కాదన్న నటి
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఒక నెటిజన్‌పై ప్రముఖ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. బలవంతపు పెళ్లి కారణం చూపిస్తూ నేరపూరిత ప్రవర్తనను సమర్థించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఏ సంస్కృతి లేదా వ్యక్తిగత పరిస్థితులు కూడా ఇటువంటి దారుణాన్ని వెనకేసుకు రావడానికి కారణం కాలేవని నటి పేర్కొన్నారు.
సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అమెరికా లేదా ఐరోపాలో ఉండి ఉంటే వారు సహజీవనం (లైవ్-ఇన్) చేసేవారని, అప్పుడు కేతన్ అగర్వాల్ అనే వ్యక్తి ఈ సమీకరణంలోకి వచ్చేవాడే కాదని, బలవంతపు పెళ్లిళ్లు తప్పంటూ ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన సుచిత్ర.. పెళ్లి ఇష్టం లేకపోతే సియాకు చట్టపరమైన, వ్యక్తిగత మార్గాలు చాలా ఉన్నాయని, అంతేకానీ హింసకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. "ఏ సంస్కృతి కూడా నేరాన్ని సమర్థించదు. ఇలాంటి నేరపూరిత ప్రవర్తనను వెనకేసుకొస్తున్న వారిని చూసి సిగ్గుపడుతున్నాను. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు, లేదా తన ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేస్తున్నారని కుటుంబంపై కేసు పెట్టొచ్చు. కానీ ముందే ప్లాన్ చేసి, కాబోయే భర్తను కొండపై నుంచి నెట్టి చంపడం కచ్చితంగా సైకో మనస్తత్వమే" అని సుచిత్ర ఘాటుగా రాసుకొచ్చారు.
జూన్ 18న లోహగడ్ కోటపై నుంచి లోయలో పడి కేతన్ అగర్వాల్ మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో ఇదొక ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యగా తేలింది. పెళ్లి ఇష్టం లేని కారణంగా సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఒకరోజు ముందే వీరిద్దరూ లోహగడ్ కోట వద్ద రిహార్సల్ కూడా చేశారని, ఆ తర్వాత ట్రెక్కింగ్ సమయంలో సియా ఇచ్చిన సిగ్నల్ ఆధారంగా చేతన్.. కేతన్‌ను కొండపై నుంచి కిందకు నెట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. దీనిని ఒక ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కూడా సియా ప్రయత్నించింది. ప్రస్తుతం వీరిద్దరినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
1994లో షారూఖ్ ఖాన్ సరసన 'కభీ హా కభీ నా' చిత్రంలో అన్నా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుచిత్రా కృష్ణమూర్తి.. డోలే డోలే, దమ్ తారా వంటి పాప్ ఆల్బమ్స్ చేశారు. రచయితగా, పెయింటర్‌గానూ రాణిస్తున్న ఆమె, చివరిగా 2024లో వచ్చిన 'డంక్: వన్స్ బిటెన్ ట్వైస్ షై' చిత్రంలో కనిపించారు.