పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీవోకేలో ప్రజా ఉద్యమం.. రోడ్లపైకి వేలాది మంది.. కాల్పుల్లో ఒకరి మృతి!

International
Advertisement
  • పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాప్తంగా ప్రజా తిరుగుబాటు
  • నిరసనకారులపై పోలీసుల కాల్పులు
  • 600 మందికి పైగా నిరసనకారుల అరెస్ట్
  • ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సర్వీసులు బంద్
  • కృత్రిమ ఆర్థిక దిగ్బంధంపై ఆగ్రహం
Advertisement
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. తమపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని, కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దాంతో పాటు గతంలో కుదిరిన 38 అంశాల లిఖితపూర్వక ఒప్పందాన్ని అమలు చేయాలని, అరెస్ట్ చేసిన తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతృత్వంలో జులై 3, 4 తేదీల్లో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి.

యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ముజఫరాబాద్, రావలకోట్, మీర్పూర్, దాద్యాల్, దేరకోట్, జీరో పాయింట్, తియాత్రీ నోట్, సరోసా ప్రాంతాల్లో భారీగా ప్రజలు గుమిగూడారు. అన్బ్ ప్రాంతంలో ప్రదర్శనకారులపై పోలీసులు, రేంజర్స్ బలగాలు టియర్ గ్యాస్ షెల్లింగ్ జరపడంతో పాటు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

కాల్పులు, టియర్ గ్యాస్ కారణంగా మరో నలుగురు యువకులు కూడా గాయపడినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ సహా అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని, మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.  

ఉగ్రవాద నిరోధక చట్టం కింద 'జాక్' సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత భద్రతా దళాలు పీవోకే వ్యాప్తంగా ఉక్కుపాదం మోపాయి. సీనియర్ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్‌తో పాటు 600 మందికి పైగా కార్యకర్తలు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. పీఓకేలోని ప్రధాన పట్టణాలకు ఆహారం, పిండి, అత్యవసర మందుల సరఫరా నిలిచిపోయేలా పాక్ అధికారులు కృత్రిమ ఆర్థిక దిగ్బంధాన్ని విధించారని స్థానిక నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు, మరిన్ని ర్యాలీలు నిర్వహించకుండా నిరోధించేందుకు అధికారులు పలు జిల్లాల్లో ఇంటర్నెట్, కమ్యూనికేషన్ బ్లాకౌట్‌ను అమలు చేస్తున్నారు.  
Advertisement

సంబంధిత వార్తలు

PoK ProtestsPakistan occupied KashmirShaukat Nawaz MirJoint Awami Action CommitteeMuzaffarabadAnti Pakistan protests

More Telugu News

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57

గేట్లు మూసేయండి.. రాప్తాడు ఘటన నేపథ్యంలో నారా లోకేశ్ కీలక ఆదేశాలు

01 Nov, 18:02

ఆ విషయాల్లో మేం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.. న్యూజిలాండ్‌తో ఓటమిపై శ్రేయస్‌

01 Nov, 18:01

‘మూడు రోజుల్లో పూర్తి చేస్తా’ అంటాం.. కానీ వారం దాటుతుంది! దీని వెనుక సైకాలజీ ఏంటో తెలుసా?

01 Nov, 17:44

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో!

01 Nov, 17:36

‘జ్ఞానేశ్‌ కుమార్‌ తర్వాత మీ వంతే మోదీజీ’.. ఢిల్లీ సభలో రాహుల్‌ గాంధీ హెచ్చరిక!

01 Nov, 17:35

రాబోయే 48 గంటలు కీలకం.. బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి లోకేశ్

01 Nov, 17:09

రాప్తాడు ఘటనతో 'సినిమా'పై చర్చ.. ఆర్జీవీ ఏమన్నాడంటే!

01 Nov, 17:09

ఏపీకి మరో తుపాను ముప్పు.. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు

01 Nov, 16:47

భూగర్భంలో దాక్కున్నా బయటకు లాగుతాం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు ఖర్గే హెచ్చరిక

01 Nov, 16:46

భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ కివీస్‌.. 3-2తో సిరీస్‌ ముగింపు

01 Nov, 16:30

ప్రభుత్వ రంగంలో మొదటిసారి.. గువహటిలో ప్రోటాన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్

01 Nov, 16:21
..More Telugu News