రేపే 'నాగబంధం' గ్రాండ్ రిలీజ్.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు!
- విరాట్ కర్ణ హీరోగా నటించిన 'నాగబంధం' రేపే విడుదల
- ఇప్పటికే 11 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ట్రైలర్
- అభిషేక్ నామా దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మాణం
- నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు కీలకపాత్రల్లో
ఈ చిత్రంలో విరాట్ కర్ణ సరసన నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు, మురళీ శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణంతో ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ పతాకాలపై కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, జునైద్ కుమార్-అభి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. భారీ అంచనాల నడుమ 'నాగబంధం' జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. నాగబంధం చిత్రం టికెట్ల అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ పోర్టల్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కు విశేష స్పందన లభిస్తోంది.