షూటింగ్ చేస్తూ ఎంబీబీఎస్ పరీక్షలు రాశా: శ్రీలీల
- ఎంబీబీఎస్ చదువే తన తొలి ప్రాధాన్యమన్న నటి
- డాక్టర్ కావడం చిన్ననాటి కల అని చెప్పిన హీరోయిన్
- ‘వైరల్ వయ్యారి’ అనుభవాన్ని పంచుకున్న శ్రీలీల
- ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ బిజీ
‘‘డాక్టర్ కావడం నా చిన్ననాటి కల. అదే నా అతిపెద్ద అభిరుచి. ‘వైరల్ వయ్యారి’ షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా నా ఎంబీబీఎస్ పరీక్షలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. షూటింగ్ పూర్తయ్యాక వెంటనే ప్రాక్టికల్స్‌కు వెళ్లేదాన్ని. మధ్యలో విరామం దొరికితే మళ్లీ సెట్స్‌కు వచ్చి షూటింగ్లో పాల్గొనేదాన్ని. ఇది అంత సులభం కాదు. కానీ వైద్య విద్య నాకు ఎంతో విలువైనది’’ అని శ్రీలీల చెప్పింది.
‘వైరల్ వయ్యారి’ పాట ‘జూనియర్’ సినిమాలోనిది. ఈ చిత్రంలో కీరీటి రెడ్డి హీరోగా నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. ప్రస్తుతం శ్రీలీల పలు భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగు చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, తమిళ చిత్రం ‘పరాశక్తి’, అలాగే అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ హిందీ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో నటిస్తోంది.