పెరిగిన వివో ఫోన్ల ధరలు.. రూ.7 వేల వరకు పెంపు
- రూ.2,000 నుంచి రూ.7,000 వరకు పెరిగిన ధరలు
- అత్యధికంగా వివో ఎక్స్300 ఎఫ్‌ఈపై రూ.7,000 పెంపు
- మెమరీ చిప్‌ల ధరలు పెరగడమే కారణమని విశ్లేషణ
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థపై ఒత్తిడి, తయారీ వ్యయాలు అధికం కావడం వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ధరల పెంపుపై వివో అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ధరలు పెరిగిన ఫోన్లలో వివో ఎక్స్300 ఎఫ్‌ఈ, వివో వీ70 ఎఫ్‌ఈ, టీ4 లైట్ 5జీ, వై51 ప్రో, వై31 5జీ, టీ5ఎక్స్, వై21, వై11, వై05 ఉన్నాయి. వీటిలో కొన్ని మోడళ్లకు ఇప్పటికే ఒకసారి ధరలు పెరగ్గా ఇప్పుడు మరోసారి సవరణ చేయడంతో ప్రారంభ ధరలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల నమోదైంది.
ధరల సవరణ తర్వాత వివో ఎక్స్300 ఎఫ్‌ఈ 12GB + 256GB వేరియంట్ ధర రూ.86,999, 12GB + 512GB వేరియంట్ ధర రూ.96,999కు చేరింది. దీంతో ఈ ఫోన్ ప్రీమియం విభాగంలో ఇతర బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో మరింత పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.