మంగళగిరిలో క్రికెట్ సంబరం... ఏపీఎల్ 2026 ఫైనల్ కు హాజరైన నారా లోకేశ్
- మంగళగిరిలో వైభవంగా ఏపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్
- భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య టైటిల్ పోరు
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్
- స్టేడియం వాతావరణం అద్భుతమంటూ లోకేశ్ ట్వీట్
స్టేడియంలోని ఉత్సాహభరిత వాతావరణాన్ని చూసి ఆయన తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. స్టేడియంలో తాను కూర్చున్న ఫొటోలను షేర్ చేస్తూ.. "ప్రేక్షకులు.. క్రికెట్.. ఇక్కడి వాతావరణం.. అత్యుత్తమంగా ఉన్న మంగళగిరిలో నేను" అంటూ ట్వీట్ చేశారు. లోకేశ్ రాకతో ఫైనల్ మ్యాచ్‌కు మరింత శోభ చేకూరింది.
క్రికెట్ అభిమానుల కేరింతలు, హోరాహోరీగా సాగిన మ్యాచ్‌తో మంగళగిరి స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాభిమానులు ఈ ఫైనల్ పోరును వీక్షించేందుకు తరలివచ్చారు.