స్వామి వారి చిత్రపటాలు చెత్తకుప్పల్లో పడేశారు: భూమన కరుణాకర్ రెడ్డి

Bhumana Karunakar Reddy slams TTD for throwing deity photos in garbage
  • అలిపిరి వద్ద వేలాది స్వామి ఫొటోలు మలమూత్రాల్లో వేశారన్న భూమన
  • చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్
  • విజిలెన్స్ పూర్తిగా నిద్రపోయిందని విమర్శ
టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విజిలెన్స్ పూర్తిగా విఫలమయిందని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి చిత్రపటాలు చెత్త కుప్పల్లో, మలమూత్రాల మధ్య పడేశారని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. “అలిపిరి నుంచి కిలోమీటర్ పరిధిలో స్వామి వారి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన చోట టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వందల, వేల స్వామి వారి ఫొటోలు చెత్త, మలమూత్రాలు, బీరు బాటిల్స్ మధ్య పడేశారు. ఇది టీటీడీ వైఫల్యం. విజిలెన్స్ పూర్తిగా నిద్రపోయింది” అని మండిపడ్డారు.

టీటీడీని ప్రక్షాళన చేస్తున్నామని రెండేళ్లుగా చెబుతున్నారని... కానీ వాస్తం ఏమిటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని భూమన తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకసారి ఇక్కడకు వచ్చి చూడాలని అన్నారు. ఇదేనా మీరు చేస్తున్న ప్రక్షాళన అని ప్రశ్నించారు. ఈ అపచారాలకు చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు. పాలకులు, టీటీడీ అధికారులు సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు.
Bhumana Karunakar Reddy
TTD News
Lord Venkateswara Photos
Chandrababu Naidu
Pawan Kalyan
Tirumala Alipiri

More Telugu News