భారీ నష్టాల్లో ఏషియా స్టాక్ మార్కెట్లు.. కారణమిదే!
- కొరియా కోస్పీ 8.2%, జపాన్ నిక్కీ 5% పతనం
- యాపిల్ షేరు 6% పడిపోవడంతో పెరిగిన ఆందోళన
- చిప్ వ్యయాలు, ప్రాఫిట్ బుకింగ్‌తో భారీ అమ్మకాలు
- 20 నిమిషాల పాటు కొరియాలో ట్రేడింగ్ నిలిపివేత
- ఏఐ షేర్లలో అమ్మకాలతో ఆసియా మార్కెట్లు కుదేలు
హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ 2.4 శాతం, చైనా సీఎస్‌ఐ300 2.9 శాతం, షాంఘై కాంపోజిట్ 2 శాతానికి పైగా పడిపోయాయి. జపాన్‌ను మినహాయించిన ఎంఎస్‌సీఐ ఆసియా-పసిఫిక్ సూచీ కూడా 3.8 శాతం క్షీణించింది. గత ఏడాది కాలంలో ఇదే అతిపెద్ద వారాంత పతనంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ అమ్మకాలకు అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రధాన కారణంగా నిలిచింది. మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడంతో ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ధరలను పెంచుతున్నట్లు యాపిల్ ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు 6.1 శాతం పడిపోగా, ఒక్క రోజులోనే దాదాపు 250 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. పెరుగుతున్న చిప్ వ్యయాలు ఏఐ రంగం లాభాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది.
అదే సమయంలో త్రైమాసికం ముగింపునకు రావడంతో పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఐ షేర్ల విలువలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో రిస్క్ తగ్గించుకునేందుకు చాలామంది విక్రయాలు చేపట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ఏఐ బూమ్‌కు ముగింపు కాదని, ఇటీవల నమోదైన భారీ ర్యాలీ తర్వాత వచ్చిన సహజమైన కరెక్షన్‌గా మాత్రమే చూడాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.