15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి అశ్విన్‌ కీలక సూచనలు!

Ashwin advice to 15 year old Vaibhav Suryavanshi
  • అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమైన వైభవ్‌ సూర్యవంశీ
  • ఆటను ఆస్వాదించాలే తప్ప ఒత్తిడి తీసుకోవద్దన్న అశ్విన్‌
  • భవిష్యత్తులో ఒత్తిడి తప్పదని హెచ్చరిక
  • వైభవ్‌ ప్రత్యేక ప్రతిభావంతుడని ప్రశంస
  • బౌలర్లకు తగ్గట్టు ఆట మార్చుకోవడం అతని ప్రత్యేకతన్న అశ్విన్‌
  • ఇటీవల లిస్ట్‌-ఏలో 11 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ
అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రానికి సిద్ధమైన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక సూచనలు చేశాడు. ఈ వయసులో ఒత్తిడి గురించి ఆలోచించకుండా ఆటను పూర్తిగా ఆస్వాదించాలని సూచించాడు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘వైభవ్‌ ఇప్పుడు 15 ఏళ్ల కుర్రాడు. తన ఊరిలో గల్లీ క్రికెట్‌ ఆడినట్లే ఈ ఆటను కూడా ఎంజాయ్‌ చేయాలి. భవిష్యత్తులో ఒత్తిడి తప్పదు. ఓ దశలో క్రికెట్‌ వృత్తిగా మారుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఎలాంటి భారం లేకుండా ఆడుతూ ప్రేక్షకులను అలరించాలి’’ అని అన్నాడు.

వైభవ్‌ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని అశ్విన్‌ ప్రశంసించాడు. ‘‘ప్రత్యేకమైన ఆటగాళ్లను చూసిన వెంటనే గుర్తించవచ్చు. వైభవ్‌లో నాకు అదే కనిపించింది. అతని బ్యాటింగ్‌ మాత్రమే కాదు.. అనుభవజ్ఞులైన బౌలర్లకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే తీరు కూడా ఆకట్టుకుంది’’ అని చెప్పాడు.

ఇటీవల ఇండియా-ఏ తరఫున ట్రై నేషన్‌ సిరీస్‌ ఫైనల్లో శ్రీలంక-ఏపై వైభవ్‌ కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్‌సెంచరీ రికార్డు నెలకొల్పాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేసి జట్టుకు టైటిల్‌ అందించాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో ఆరెంజ్‌ క్యాప్‌ గెలవడం, వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేయడం, టీ20ల్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ నమోదు చేయడం వంటి పలు రికార్డులు అతని పేరిట ఉన్నాయి.
Vaibhav Suryavanshi
Ravichandran Ashwin
Indian Cricket
Fastest List A half century
India A vs Sri Lanka A
Youngest cricketer records

More Telugu News