మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. ఆయుధాలు, నగదు లభ్యం

Maoist weapon dump and 24 lakh cash seized in Chhattisgarh
  • ఛత్తీస్‌గఢ్‌లోని టెకా అటవీ ప్రాంతంలో బలగాల కూంబింగ్
  • బట్టబయలైన మావోల రహస్య డంప్
  • రూ. 24 లక్షల నగదు లభ్యం
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లు బాగా ఫలితాలు ఇస్తున్నాయి. నారాయణ్‌పూర్ జిల్లాలోని టెకా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు వచ్చిన నమ్మకమైన సమాచారంతో పోలీసు-సీఆర్‌పీఎఫ్ బలగాలు అలర్ట్ అయ్యాయి. మావోల కోసం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో, నేల కింద రహస్యంగా తవ్వి పాతి ఉంచిన భారీ ఆయుధాల డంప్ బయటపడింది. ఆ డంప్‌లో అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. రూ.24 లక్షల నగదు కూడా లభ్యమయింది. దీంతో, టెకా చుట్టుపక్కల అడవుల్లో మరిన్ని రహస్య నిల్వలు ఉండొచ్చే అనుమానాలతో... అదనపు బలగాలతో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్స్‌తో పాటు మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి తనిఖీలు మరింత తీవ్రం చేశారు.
Maoists
Chhattisgarh
Narayanpur
CRPF
Weapons dump
Cash seizure

More Telugu News