మారుతీ డిజైర్ ప్రియం.. రూ.7,500 వరకు పెరిగిన ధరలు
- మారుతీ డిజైర్ ధరలు రూ.7,500 వరకు పెంపు
- LXI బేస్ వేరియంట్ ధర యథాతథం
- VXI CNG, ZXI CNGపై అత్యధిక పెంపు
- 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్
- CNG మోడల్ మైలేజీ 33.73 కిమీ/కేజీ
- భారత్ NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్
కొత్త ధరలు ఇవే..
- LXI – రూ.6.25 లక్షలు
- VXI – రూ.7.22 లక్షలు
- ZXI – రూ.8.22 లక్షలు
- ZXI+ – రూ.8.91 లక్షలు
మైలేజీ, ఇంజిన్ ప్రత్యేకతలు
డిజైర్‌లో 1.2 లీటర్ Z-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్, 112 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
- మాన్యువల్ మోడల్ మైలేజీ – 24.79 కిమీ/లీటర్
- AMT మోడల్ మైలేజీ – 25.71 కిమీ/లీటర్
- CNG మోడల్ మైలేజీ – 33.73 కిమీ/కేజీ
భద్రతలోనూ ముందే
డిజైర్‌కు భారత్ NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు వంటి భద్రతా ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి.