వైసీపీలోని కాపు నేతలపై సోము వీర్రాజు విమర్శలు
- కాపులకు టీడీపీ సముచిత గౌరవం ఇస్తోందన్న వీర్రాజు
- కాపులను వైసీపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని మండిపాటు
- జగన్ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం అందరికీ తెలుసని వ్యాఖ్య
కాపు సామాజికవర్గానికి టీడీపీ సముచిత గౌరవం ఇస్తూ రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పిస్తుంటే... వైసీపీ మాత్రం వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత జగన్ ఐదేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం ఏంటో, వారికి దక్కిన గౌరవం ఎంతో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసంటూ చురకలంటించారు. ప్రతి చిన్న రాజకీయ అవసరానికి కాపులను అస్త్రంగా వాడుకునే సంప్రదాయాన్ని వైసీపీ ఇకనైనా మానుకోవాలని వీర్రాజు హితవు పలికారు. వైసీపీలో ఉన్న కాపు నేతలకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ... ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.