జలుబు, దగ్గు లేకున్నా తరచూ జ్వరం వస్తోందా? పిల్లల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
- యూటీఐ వల్ల జ్వరం రావచ్చు
- చిన్నపిల్లల్లో జ్వరం ఒక్కటే ప్రధాన లక్షణంగా కనిపించే అవకాశం
- ఆహారం తినకపోవడం, వాంతులు, నీరసం వంటి సంకేతాలు ఉండొచ్చు
- పదేపదే జ్వరం వస్తే మూత్ర పరీక్షలు అవసరం
- కొంతమంది పిల్లల్లో యూటీఐ మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం
- చికిత్స ఆలస్యమైతే మూత్రపిండాలపై ప్రభావం
పిల్లలకు జ్వరం వస్తే చాలా మంది తల్లిదండ్రులు ముందుగా జలుబు, దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ గురించే ఆలోచిస్తారు. అయితే ఎలాంటి శ్వాసకోశ లక్షణాలు లేకపోయినా పదేపదే జ్వరం వస్తుంటే దాని వెనుక మూత్రనాళాల ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్-యూటీఐ) ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్యను గుర్తించడం కాస్త కష్టమవుతుండటంతో చాలాసార్లు ఆలస్యంగా బయటపడుతోంది.
సాధారణంగా పెద్ద పిల్లలు మూత్రం పోసేటప్పుడు మంటగా ఉందని, కడుపు నొప్పిగా ఉందని చెప్పగలుగుతారు. కానీ శిశువులు, చిన్నపిల్లలు తమ సమస్యను వివరించలేరు. అందువల్ల జ్వరం ఒక్కటే ప్రధాన లక్షణంగా కనిపించే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది వైరల్ ఫీవర్‌గా భావించి చికిత్స తీసుకుంటారు. దీంతో అసలు సమస్య గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే
జ్వరంతో పాటు కొన్ని ఇతర సంకేతాలు కూడా కనిపించొచ్చు. చిన్నపిల్లలు సరిగా పాలు లేదా ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా ఏడవడం, కారణం లేకుండా వాంతులు కావడం, నీరసంగా కనిపించడం, మూత్రం దుర్వాసన రావడం, కడుపు నొప్పి, బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు వచ్చినా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
పదేపదే జ్వరం
వారం, నెలల వ్యవధిలో తరచూ జ్వరం వస్తుంటే కేవలం జ్వర మందులతో సరిపెట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం తగ్గి మళ్లీ వస్తుంటే దాని వెనుక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇతర కారణాలు కనిపించనప్పుడు మూత్ర పరీక్ష చేయించడం మంచిదని చెబుతున్నారు.
కొంతమందిలో ప్రమాదం ఎక్కువ
మూత్రపిండాలు, మూత్రాశయం నిర్మాణంలో లోపాలు ఉన్న పిల్లల్లో యూటీఐ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రం వెనక్కి మూత్రపిండాల వైపు వెళ్లే వెసికోయూరెటరల్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారిలోనూ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావచ్చు. మలబద్ధకం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వంటి అలవాట్లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.
ఆలస్యమైతే మూత్రపిండాలపై ప్రభావం
యూటీఐని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ మూత్రాశయం నుంచి మూత్రపిండాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. పదేపదే ఇన్ఫెక్షన్లు వస్తే మూత్రపిండాలపై మచ్చలు ఏర్పడటం, పనితీరు తగ్గిపోవడం, భవిష్యత్తులో రక్తపోటు సమస్యలు రావడం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏం చేయాలి?
పిల్లలకు తగినంత నీరు తాగించాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకుండా చూడాలి. మలబద్ధకం ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అలవాటు చేయాలి. ముఖ్యంగా కారణం తెలియకుండా పదేపదే జ్వరం వస్తుంటే వైద్యులను సంప్రదించి మూత్ర పరీక్షలు చేయించాలి.