26/11 దాడి ప్రత్యక్ష సాక్షిని కలిసిన అమెరికా మంత్రి రూబియో.. బాధితులకు నివాళి
- దాడి సమయంలో విధుల్లో ఉన్న తాజ్ హోటల్ సెక్యూరిటీ చీఫ్‌ను కలిసిన రూబియో
- ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టీకరణ
- మంత్రి జైశంకర్‌తో రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాలపై కీలక చర్చలు
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో 26/11 ఉగ్రదాడి సమయంలో విధుల్లో ఉన్న నాటి సెక్యూరిటీ చీఫ్‌ను కలిశారు. మంగళవారం ముంబై పర్యటనలో భాగంగా ఆయన తాజ్ హోటల్‌ను సందర్శించి, ఆనాటి భయానక ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ముందుగా, తాజ్ హోటల్లోని 26/11 స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి రూబియో నివాళులర్పించారు. అనంతరం, ఆనాటి హోటల్ సెక్యూరిటీ చీఫ్ సునీల్ కుద్యాడిని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆయనకు పరిచయం చేశారు. ఉగ్రదాడి జరిగిన తీరు, ఆ మారణకాండ ఎంతసేపు కొనసాగింది వంటి వివరాలను రూబియో స్వయంగా కుద్యాడి మాటల్లోనే విన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో అమెరికా భాగస్వామ్యం పటిష్టంగా కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
2008 నవంబర్ 26న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 166 మంది బాధితులకు (వారిలో ఆరుగురు అమెరికన్లు ఉన్నారు) గౌరవ సూచకంగా నివాళులర్పించినట్లు రూబియో 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. సహాయక సిబ్బంది ధైర్యసాహసాలను కొనియాడుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరు దేశాల భాగస్వామ్యం సుస్థిరంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
అనంతరం విదేశాంగ మంత్రి జైశంకర్‌తో రూబియో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా నుంచి ఇంధన వాణిజ్యాన్ని పెంపొందించాలని, అమెరికన్ సాంకేతికతను భారత్ మరింతగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. రక్షణ, పౌర అణు సహకార రంగాల్లో సాధించిన పురోగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మధ్యప్రాచ్యంలోని పరిణామాలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు నేతలు చర్చించినట్లు సమాచారం. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ వంటి కీలక అంశాలపై తమ చర్చలు ఫలప్రదంగా సాగాయని జైశంకర్ వెల్లడించారు.