టైగర్ ష్రాఫ్ టీమ్ సీరియస్.. ఫేక్ న్యూస్‌పై లీగల్ యాక్షన్ హెచ్చరిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టైగర్ ష్రాఫ్ టీమ్ సీరియస్.. ఫేక్ న్యూస్‌పై లీగల్ యాక్షన్ హెచ్చరిక

Tiger Shroff team warns of legal action against fake news
  • టైగర్ ష్రాఫ్ పేరిట ఫేక్ న్యూస్, ఏఐ వీడియోల ప్రచారం
  • తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసిన టీమ్
  • తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
  • సమాచారాన్ని నిర్ధారించుకోవాలని మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు సూచన
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించి ఇటీవల జరిగిన కాల్పుల ఘటన తర్వాత, ఆయన పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన టీమ్ తీవ్రంగా స్పందించింది. కొన్ని సోషల్ మీడియా పేజీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్.. ఏఐ (AI) జనరేటెడ్ వీడియోలు, కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది.

ఆదివారం సాయంత్రం జరిగిన దురదృష్టకర ఘటనపై టైగర్ ష్రాఫ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, ఏ వీడియోనూ విడుదల చేయలేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది. "టైగర్ మాట్లాడినట్టుగా నకిలీ కథనాలు, ఏఐ వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు, అనధికారికమైనవి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారు" అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విషయంలో మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టైగర్ టీమ్ కోరింది. టైగర్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ప్రచురించే ముందైనా దాన్ని ధ్రువీకరించుకోవాలని సూచించింది. కేవలం ఎంగేజ్‌మెంట్ లేదా డబ్బు సంపాదన కోసం తప్పుడు సమాచారాన్ని సృష్టించడం, ప్రచారం చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేసింది.

"ఇలాంటి కల్పిత కంటెంట్‌ను సృష్టించినా, ప్రచారం చేసినా సదరు వ్యక్తులు లేదా పేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇలాంటి కొన్ని ఉదంతాలను మేం గమనించాం. బాధ్యులపై అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు మాకు ఉంది" అని టీమ్ స్పష్టం చేసింది. ప్రజలు కూడా టైగర్ ష్రాఫ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, ఆయన టీమ్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.
Advertisement
Tiger Shroff
Tiger Shroff fake news
Tiger Shroff legal action
Tiger Shroff AI videos
Bollywood news
Tiger Shroff team statement

More Telugu News