సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి... ఉత్కంఠ పోరులో శ్రీలంక-ఏ థ్రిల్లింగ్ విక్టరీ

India A lose in Super Over Sri Lanka A thrilling victory in intense clash
  • త్రైపాక్షిక సిరీస్‌లో భారత్-ఏపై శ్రీలంక-ఏ విజయం
  • స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు చేరిన మ్యాచ్
  • సూపర్ ఓవర్ లో శ్రీలంకది పైచేయి
  • పిచ్‌పై పరుగెత్తినందుకు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ
  • ఫైనల్ చేరాలంటే ఆఫ్ఘనిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి
శ్రీలంక-ఏతో జరిగిన ఉత్కంఠభరిత వన్డే మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువగా అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు, ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న తీవ్ర వాగ్వాదాలు, ఉద్రిక్తతలు చర్చనీయాంశంగా మారాయి. డంబుల్లా వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక-ఏ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఏ 16 పరుగులు చేయగా, భారత జట్టు 9 పరుగులు మాత్రమే చేసి 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక బౌలర్ కుగతాస్ మతులన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు.

అంతకుముందు, భారత జట్టు ఒక దశలో 143 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో సూర్యాన్ష్ షెడ్గే (72), విప్రజ్ నిగమ్ (51) ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయితే, నిగమ్ రెండుసార్లు పిచ్‌పై పరుగెత్తినందుకు అంపైర్లు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ విధించడం జట్టుకు నష్టం చేకూర్చింది. శ్రీలంక ఛేదనలో సదీర సమరవిక్రమ (93) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఫైనల్ చేరాలంటే బుధవారం ఆఫ్ఘనిస్థాన్-ఏతో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.
Go Back to Shorts
India A
Sri Lanka A
Super Over
Dambulla
Suryansh Shedge
Vipraj Nigam

More Telugu News