స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ

Andhra
Advertisement
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయడంలో జగన్ పాత్రపై టీడీపీ ఆరోపణ
  • ప్లాంట్ భూములు అమ్మి నిధులు సమీకరించాలని కేంద్రానికి జగన్ లేఖలు రాశారన్న పట్టాభి
  • ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకున్నారని విమర్శ
  • జగన్ హయాంలో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని ఆరోపణ
Advertisement
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని, కీలకమైన గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకోవాలని జగన్ కేంద్రానికి లేఖలు రాశారని, ఇటువంటి చర్యల వల్లే ప్లాంట్ ఆర్థికంగా కుదేలైందని ఆయన విమర్శించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన వేలాది ఎకరాల భూములను విక్రయించి, ఆ నిధులతో ప్లాంట్‌ను బలోపేతం చేయాలని జగన్ కేంద్రానికి ప్రతిపాదించారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను ఆయన మీడియాకు ప్రదర్శించారు.

జగన్ ప్రభుత్వ హయాంలో (2019-2024) ప్లాంట్‌కు అనుబంధంగా ఉన్న విజయనగరం జిల్లాలోని మాంగనీస్, సిలికా గనుల లీజులను ఉద్దేశపూర్వకంగానే పునరుద్ధరించలేదని పట్టాభి ధ్వజమెత్తారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం 25 శాతం పడిపోయిందని, ఉద్యోగుల సంఖ్య కూడా 2020లో 17,000 ఉండగా, 2023 నాటికి 14,800కి తగ్గిపోయిందని వివరించారు.

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల లీజులను పొడిగించిందని, తద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని 90 శాతానికి పైగా పునరుద్ధరించిందని పట్టాభి తెలిపారు. ప్రభుత్వ చొరవ ఫలితంగా ప్లాంట్ సుమారు రూ. 54 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటానని జగన్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, ఆయన గతంలో కేంద్రానికి రాసిన లేఖలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.                                
Advertisement

సంబంధిత వార్తలు

YS Jagan Mohan ReddyVisakhapatnam Steel PlantKommareddy PattabhiramVizag Steel land saleAndhra Pradesh politicsTDP vs YSRCP

More Telugu News

నటనలో 'బాద్‌షా'.. వ్యాపారంలోనూ 'కింగ్'.. షారుఖ్ ఆస్తుల విలువ రూ. 10,000 కోట్లు!

02 Nov, 15:04

48 ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

02 Nov, 15:02

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్ షా.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం

02 Nov, 15:00

ఈ అర్ధరాత్రి తీరం తాకనున్న 'మురసు' తుపాను.. ఒంగోలుకు 210 కి.మీ దూరంలో కేంద్రీకృతం

02 Nov, 14:57

మంత్రి పదవి ఇవ్వలేదు.. నిధులూ రావడం లేదు.. రేవంత్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఆగ్రహం

02 Nov, 14:38

వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. 11న పార్టీని ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

02 Nov, 14:34

ఏపీలో పరిషత్ పోరు.. ఈ నెల 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

02 Nov, 14:28

గ్రోక్ ఏఐతో ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ: ఎలాన్ మస్క్

02 Nov, 14:19

దీపావళి ఎలా జరుపుకోవాలో ప్రజలకు తెలుసు.. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌కు బీజేపీ, శివసేన చురకలు

02 Nov, 14:03

జయ న‌న్ను అలా పిలవడం మా నాన్నకు నచ్చలేదు.. పెళ్లి నాటి సీక్రెట్ చెప్పిన అమితాబ్

02 Nov, 13:57

న్యూజిలాండ్ వీధుల్లో సామాన్యుల్లా భారత క్రికెటర్లు.. వీడియో వైరల్!

02 Nov, 13:46

రోహిత్‌ వర్సెస్‌ కోహ్లీ: ఎవరు సెంచరీ చేస్తారు? పుజారా అంచనా ఇదే..!

02 Nov, 13:45

పాకిస్థాన్‌ విదేశాంగ విధానాన్ని నడిపించేది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పేసిన మంత్రి ఖవాజా

02 Nov, 13:37

అందరినీ మెప్పించాలంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలి.. విమర్శకులకు రెహమాన్‌ సమాధానం!

02 Nov, 13:23

క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో పరుగులు తీసిన రోగులు.. ఇదిగో వీడియో!

02 Nov, 13:22
..More Telugu News