అడ్రస్ పెట్టు.. ఫాస్ట్ గా అడ్రస్ పెట్టు.. ఫ్యాన్‌కు కుకీస్ పంపిన జూనియర్ ఎన్టీఆర్!
- స్వయంగా కుకీస్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
- తన పిల్లలకు రెండు కుకీస్ పంపించమని అడిగిన అభిమాని
- అడ్రస్ తీసుకుని కుకీస్ పంపిన తారక్
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెరపైనే కాదు, వంటింట్లో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఆయన వండే బిర్యానీ, నాటు కోడి కూర గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఉంది. అయితే, తాజాగా తారక్ తన కుకింగ్ స్కిల్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లి.. మొదటిసారి కుకీస్ బేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఎన్టీఆర్ నుండి ఊహించని రిప్లై రావడంతో ఆ అభిమాని షాక్ అయ్యాడు. "అన్నా.. నీ రిప్లై చూసి నా చేతులు, కాళ్లు వణుకుతున్నాయి, కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నా జీవితంలో ఇది మర్చిపోలేని క్షణం" అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే, తారక్ కేవలం రిప్లైతోనే ఆగిపోకుండా, అన్న మాట ప్రకారం ఆ అభిమాని ఇంటికి నిజంగానే కుకీస్ పంపించి తన మనసును చాటుకున్నాడు.
ఇక మరో నెటిజన్.. "బిర్యానీ, చికెన్ వండే టైగర్ ఇప్పుడు కుకీస్ కూడా చేస్తున్నారా?" అని జోక్ చేయగా... దానికి కూడా తారక్ అంతే ఫన్నీగా మరో బ్రహ్మానందం మీమ్ డైలాగ్ “మారాయ్.. అన్నీ మారాయ్!” అంటూ రిప్లై ఇచ్చారు. అభిమానులతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సరదా సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.