నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్
- పవన్ కల్యాణ్‌పై పోస్ట్‌కు కౌంటర్‌గా బండ్ల స్పందన
- ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దని హితవు
- నీ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలంటూ కౌంటర్
- తర్వాత ప్రపంచాన్ని మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు
‘‘నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. పని లేకపోతే చూసుకో. కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్!’’ అంటూ బండ్ల గణేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
తెలంగాణ మొత్తం తిరుగుతానని, ఈసారి ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పరోక్షంగా స్పందించిన ప్రకాశ్ రాజ్ ‘‘సింగిల్‌గా వస్తారా? లేదా పొత్తుతో వస్తారా? అని ప్రశ్నించారు. ముందు అది చెప్పి రావాలని వ్యాఖ్యానించారు.