రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్!
- రవిశాస్త్రితో సరదా సంభాషణలో ఆకట్టుకున్న వైభవ్
- బంతిని బలంగా బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్? అని అడిన రవిశాస్త్రి
- ప్రస్తుతం తాను పాలు తాగడం లేదని ఫన్నీగా చెప్పిన యువ సంచలనం
- ఐపీఎల్ 2026లో ఐదు అవార్డులు గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ
ఈ సీజన్లో వైభవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ సిక్సెస్ అవార్డులను గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతేడాది 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన సాయి సుదర్శన్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.
అంతేకాదు ఈ సీజన్లో మొత్తం 72 సిక్సర్లు బాది, ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59) రికార్డును కూడా తుడిచిపెట్టాడు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి.. వైభవ్‌తో సరదాగా ముచ్చటించాడు. "ఇంత చిన్న వయసులో ఇంత బలంగా బంతిని బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్?" అని శాస్త్రి హిందీలో అడగ్గా.. "నేనిప్పుడు పాలు తాగడం లేదు" అని వైభవ్ నవ్వుతూ సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.