సీఎం పదవికి రాజీనామా చేశాను... సిద్ధరామయ్య భావోద్వేగ ప్రకటన

28-05-2026 Thu 15:39 | National
Advertisement
  • కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
  • అధిష్ఠానం ఆదేశాల మేరకే ఈ నిర్ణయమన్న సిద్ధూ
  • గవర్నర్ కార్యాలయంలో రాజీనామా పత్రం సమర్పణ
  • సీఎంగా అవకాశం ఇచ్చిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు
  • పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానంటూ భావోద్వేగం
Advertisement
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. అనంతరం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సిద్ధరామయ్య కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పటి నుంచి పార్టీ తనను ఎంతో ఆదరించిందని గుర్తుచేసుకున్నారు. మంత్రిగా, రెండుసార్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. ఏడు కోట్ల కన్నడ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టమన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని సిద్ధరామయ్య అన్నారు. తన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదని, తాను గ్రామీణ జీవితం నుంచి వచ్చానని, పొరపాటున రాజకీయాల్లోకి అడుగుపెట్టానని వ్యాఖ్యానించారు.

తన రాజకీయ జీవితంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా తనకు సీఎం అయ్యే అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించానని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వాన్ని తాను బలంగా నమ్ముతానని, సమాజంలో అసమానతలు తొలగిపోయి అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే తన ఆకాంక్ష అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం తనకుందని ఆయన తెలిపారు.
Advertisement
SiddaramaiahKarnataka politicsDK ShivakumarCongress partyChief Minister resignationSonia GandhiRahul GandhiMallikarjun KhargeKarnataka governmentLok Bhavan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more